Prema Vennela Song Lyrics – Chitralahari Movie

Song Details:

  • Music: Devi Sri Prasad
  • Lyrics: Srimani
  • Singer: Sudarshan Ashok

Prema Vennela Song Lyrics – Chitralahari Movie

రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో
ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా
ఏడు రంగులొక్కటై పరవశించు వేళలో
నేలకే జారిన కొత్త రంగులా
వానలా, వీణలా, వాన వీణ వాణిలా
గుండెలో పొంగిన కృష్ణవేణిలా
ఒంటరి మనసులో ఒంపి వెళ్ళకే అలా
సరిగమల్ని తియ్యగా ఇలా…
ప్రేమ వెన్నెలా
రావె ఊర్మిళా
ప్రేమ వెన్నెలా…
రావె ఊర్మిళా…హా.ఓ.
రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో
ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా
ఏడు రంగులొక్కటై పరవశించు వేళలో
నేలకే జారిన కొత్త రంగులా…
Hm’ దిద్దితే నువ్వలా కాటుకే కన్నుల
మారదా పగలిలా అర్ధరాత్రిలా
నవ్వితే నువ్వలా మెల్లగా మిలమిలా
కలవరం గుండెలో కలత పూతలా
రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా
మరిపోయెనేమో నీ రెండు కళ్ళలా
నిక్కమైన నీలమోకటి చాలు అంటూ వేమన
నిన్ను చూసే రాసినాడలా
ప్రేమ వెన్నెలా
రావె ఊర్మిళా
ప్రేమ వెన్నెలా…హో
రావె ఊర్మిళా…హా.ఆ.
నడవకే నువ్వలా కలలలో కోమలా… ఆ…
నడవకే నువ్వలా కలలలో కోమలా
పాదమే కందితే మనసు విలవిలా
విడువకే నువ్వలా పలుకులే గలగలా
పెదవులే అదిరితే గుండె గిలగిలా
అంతులేని అంతరిక్షమంతు చూడకే అలా
నీలమంత దాచిపెట్టి వాలుకన్నులా
ఒక్కసారి గుండెలోకి అడుగుపెట్టి రా ఇలా
ప్రాణమంత పొంగిపోయేలా…
ప్రేమ వెన్నెలా (ప్రేమ వెన్నెలా)
రావె ఊర్మిళా (రావె ఊర్మిళా)
ప్రేమ వెన్నెలా…ఓ (ప్రేమ వెన్నెలా)
రావే ఊర్మిళా…

Also, Read about movie download websites:

Tags: